![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -310 లో.....వీరు మోసం చేసాడని ఇషిక కోపంగా ఉంటుంది. ఇషిక దగ్గరికి వీరు వెళ్తాడు. నువ్వు నాతో ఏం మాట్లాడకు బ్రో.. నువ్వు ఇంత మోసం చేస్తావని అసలు ఊహించలేదని ఇషిక అంటుంది. నీకు మోసం జరిగింది అంటున్నావ్ మరి నాకు జరిగిన మోసాన్ని ఎవరికి చెప్పమంటావని వీరు తన ఫోన్ లో ఉన్న వీడియోని చూపిస్తాడు. అందులో గంగ, రంగా ఫారెనర్స్ గా వచ్చి గెటప్ చేంజ్ చేస్తున్నా వీడియోని చూపిస్తాడు. చూసావా ఇషిక ఎలా ట్రాప్ చేసారోనని వీరు అంటాడు. అదంతా కావాలనే రుద్ర స్కెచ్ వేసి చేయించాడని వీరు చెప్తాడు.
మరొక వైపు వీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకోని బ్యాగ్ తీసుకొని వస్తాడు. అందరు తనపై కోపంగా ఉంటారు. బ్రో అసలు ఏం తప్పు చెయ్యలేదు.. వాళ్ళు కావాలనే ఇదంతా చేశారు.. వీరు బ్రో తన షేర్ అమ్ముకొని నాకు నష్టం వచ్చిన డబ్బు ఇచ్చాడు కావాలంటే డబ్బు క్రెడిట్ అయినట్టు మెసేజ్ చూడండి అని ఇషిక అంటుంది. నాకు మీరు తప్ప ఎవరు లేరు కానీ మీరే నన్ను ద్రోహం చేశారు అంటుంటే ఏం చెయ్యాలని వీరు యాక్టింగ్ చేస్తాడు. అప్పుడే ప్రీతీ కళ్ళు తిరిగిపడిపోతుంది.. బ్రో వదినని లోపలికి తీసుకొని వెళ్ళమని ఇషిక అంటుంది. చూసావా వాడు ఎలా మార్చాడో అని రంగా, గంగ అనుకుంటారు. ఈ విషయం వెంటనే బావకి చెప్పాలని రంగా అంటాడు. ఆ విషయం వెంటనే రుద్రకి ఫోన్ చేసి చెప్తాడు. నువ్వు అదంతా వదిలేయ్ ముందు కాంపిటేషన్ గురించి ఫోకస్ చెయ్ అని గంగకి రుద్ర చెప్తాడు.
మరొకవైపు ఆ రుద్ర ఇంత ప్రాబ్లమ్ క్రియేట్ చేసాడు.. వాడిని బ్రతనివ్వనని వీరు అంటాడు. ఆ తర్వాత రుద్ర వస్తుంటే వీరు ఆక్సిడెంట్ చేయిస్తాడు. రుద్ర చేతికి గాయమవుతుంది. ఇంటికి వస్తాడు. అందరు తన చుట్టూ ఉండి మాట్లాడుతుంటారు. గుళ్లో నుంచి బొట్టు తెచ్చాను రుద్రకి పెట్టు గంగ.. తనకి ఏ స్ట్రెస్ ఇవ్వకండి అని శకుంతల పాజిటివ్ గా మాట్లాడుతుంటే రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మరుసటి రోజు ఉదయం పైడిరాజు, లక్ష్మీ లేరని విశ్వతో సుధా అంటుంది. ఓహ్. నీకు అసలు విషయం తెలియదు కదా.. అందుకే ఇంత కూల్ గా మాట్లాడుతున్నావని విశ్వ అంటాడు. ఏం అయిందని సుధా అడుగగా నీ మేనల్లుడికి నిన్న రాత్రి యాక్సిడెంట్ జరిగిందని విశ్వ చెప్తాడు. దాంతో సుధా కంగారుపడుతుంది. వెంటనే సుధా బాధపడుతూ ఇంటికి వెళ్ళొస్తానని విశ్వని అడిగితే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు విశ్వ. సుధా లోపలికి వెళ్లి రుద్రతో మాట్లాడుతుంది. అన్నయ్య నాకు ఎందుకు చెప్పలేదని పెద్దసారుతో చెప్తూ అలుగుతుంది సుధా. తర్వాత పెద్దసారు సారీ చెప్పి రిక్వెస్ట్ చేశాక. మామూలు అవుతుంది. ఇక దిష్టితీయాలని గంగని మిరపకాయలు తెమ్మంటుంది సుధా. ఆవిడగారు వచ్చి దిష్టి తీస్తే తప్ప రుద్ర మాములు అవ్వడా అని శకుంతల అంటుంది. పెద్దమ్మ.. అత్తమ్మని అలా అనకండి అని ప్రీతి అనగానే నీ శ్రీమంతానికి పిలవమ్మన్నావ్.. పిలిచాను అంతే కానీ నాకు సలహాలు ఇవ్వొద్దని శకుంతల అంటుంది. దాంతో ప్రీతి సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |